బీజేపీది విద్వేషం, టీఆర్ఎస్ ది దోపిడీ .. ఆ రెండు పార్టీలు దొందు దొందే

.. నాలుగో రోజు ఉత్సాహంగా సాగిన భారత్ జోడో యాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో బీజేపీ విద్వేషం రాజకీయాలు చేస్తుంటే… టీఆర్ఎస్ ప్రతి అంశంలో దోపిడీకి పాల్పడుతున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దొందు దొందూగానే వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం భారత్ జోడో యాత్ర 52వ రోజు రాహుల్ తన కవాతును దర్మాపూర్ లోని జయప్రకాష్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల నుండి ప్రారంభించారు. ఉదయం ఆరు గంటలకే తెలంగాణాలో నాలుగవ రోజు యాత్రలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం నుండి పాదయాత్రగా సాగిన రాహుల్ భారత్ జోడో జన జాతరగా ముందుకు దూసుకు వెళ్లింది. జనసంద్రంతో సాగుతున్న యాత్ర పాలమూరు యూనివర్సిటీ, బండమీదపల్లి, గణేశ నగర్, వన్ టౌన్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు చేరి అల్పాహారం కోసం చిన్న విరామం తీసుకుంది. తిరిగి రాహుల్ పాదయాత్ర న్యూటౌన్ చౌరస్తా, షాషాబ్ గుట్ట చౌరస్తా, మెట్టుగడ్డ, పద్మావతి కాలనీ మీదుగా యెనుగొండలోని గోపాలరెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన మద్యాహ్న భోజన విరామ శిబిరానికి చేరుకుంది. ఇక నాలుగవ రోజు యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాస్కీ, సీతక్క, వంశీచందర్ రెడ్డి, బల్మూరి వెంకట్ తదితరులు రాహుల్ వెంట పాదం కదిపారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభం కాగానే రాహుల్ క ఎదురెళ్లి స్వాగతం

పలికిన ఎమ్మెల్యే సీతక్క అడవి బిడ్డలతో అడుగులు వేస్తూ…దేశాన్ని ఐక్యం చేస్తూ ముందుకు కదులుదాం అంటూ నినదిస్తూ ముందుకు సాగింది.
అదే విధంగా తమ అడవి బిడ్డలతో రాహుల్ గాంధీ కొమ్ము డాన్స్ చేశారు. తమ జాతి సంతోషం ఉన్న దుఃఖమున్న ఆదివాసి డోలు మోగిస్తూ
ఆటపాటలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటామని… అలాంటి మా సాంప్రదాయాన్ని రాహుల్ అన్న గౌరవిస్తూ మాతో పాటు కలిసి కొమ్ము నృత్యం చేయడం చాలా
ఆనందాన్ని కలిగించింద సీతక్క సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక భోజన విరామం సమయంలో వివిద వర్గాలతో సమావేశమైన రాహుల్ వారికి యాత్ర ద్వారా
భరోసా ఇఛ్చారు. అనంతరం అప్పన్నపల్లి, కేసీఆర్ ఎకోపార్కు, శంకరాయపల్లి తండా మీదుగా రాహుల్ యాత్ర జడ్చర్ల చౌరస్తాకు చేరకుంది. అనంతరం
అక్కడి ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించగా, తెలంగాణ ఎన్ ఎస్ యూఐ నేత బల్మూరి వెంకట్ అనువదించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ అన్నదమ్ముల నడుమ విద్వేషాలు రగిలించి మనదేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. నోట్ల రద్దుతో దేశాన్ని విఛ్చిన్నం చేసిందని ధ్వజమెత్తారు. ఒకవైపు నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెస్తే, తెలంగాణాలో కేసీఆర్, దళిత, గిరిజనుల భూములు
గుంజుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. మోడీ నల్లచట్టాలకు కేసీఆర్ పూర్తి ఇచ్చాడని గుర్తు చేశారు. జీఎస్టీ ద్వారా చేనేత కార్మికుల నడ్డి విరిచారని
మండిపడ్డారు. దేశంలో విధ్వంసాలకు, విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజలు నిలుస్తున్నారు. యాత్ర ద్వరా దేశ సమైక్యతను చాటి చెప్పే ప్రయత్నం
చేస్తున్నామని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మన దేశ చరిత్రకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. దేశంలోని నలుగురు సంపన్నులకు మాత్రమే సంపదను కొల్లగొట్టి పెడుతున్నారని మండిపడ్డారు. భారతదేశంలో బీజేపీ వలన అధిక సంపన్నులు, అధిక నిరుద్యోగులు ఉండటానికి బీజేపీ కారణమని గుర్తు చేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, రైతులకు ఈ దేశంలో న్యాయం జరగదని ఆవేదన అర్ధం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్య, వైద్య సదుపాయాలకు అధిక ప్రాదాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ అన్నారు.
అనంతరం అక్కడి నుంచి గొల్లపల్లి సమీపంలోని లలితాంబిక ఆలయం వద్ద ఏర్పాటు చేసే రాత్రిబస వద్దకు యాత్ర చేరుకుంది.
4వ రోజు మరింత ఉత్సాహంగా సాగిన రాహుల్ యాత్రలో వేలాది మంది పాల్గొనగా సినీనటి పూనమ్ కౌర్ కూడా
ఆయన్ను కలుసుకున్నారు. 52వ రోజు భారత్ జోడో యాత్ర, తెలంగాణాలో 4వ రోజు జనజాతరగా ముందుకు సాగింది.

Leave A Reply

Your email address will not be published.