పార్టీలన్నీ కలిసికట్టుగా బరిలోకి దిగితే భాజపా గెలుపు అసాధ్యం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా నిలిస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో జరిగిన ‘ఇండియా’ కూటమి రెండ్రోజుల సమావేశానంతరం మీడియా సంయుక్త సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, దేశ జనాభాలోని 60 మందికి ఈ వేదక ప్రాతినిధ్యం వహిస్తోందని, ఈ పార్టీలన్నీ కలిసికట్టుగా పోటీలోకి దిగితే బీజేపీ గెలుపు ముమ్మాటికీ అసాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.

 

రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నాం..

 

రెండ్రోజుల సమావేశంలో రెండు పెద్ద నిర్ణయాలు తీసుకున్నామని రాహుల్ వివరించారు. 14 మంది సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు, సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలు, నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించడం వీటిలో కీలకమని చెప్పారు. తొలి రెండు సమావేశాలు నాయకుల మధ్య చక్కటి అవగాహన ఏర్పడడానికి దోహదపడ్డాయని, అంతా ఒకేమాటపై కలిసికట్టుగా పోరాడాలనే సంకల్పాన్ని చాటిచెప్పాయని చెప్పారు. విభేదాలు అనేవి సహజమే అయినా, వాటిని నాయకులంతా కలిసికట్టుగా పక్కనపెట్టి ముందుకు వెళ్లాలనే పట్టుదలతో ఉండటం తనను విశేషంగా ఆకట్టుకుందని చెప్పారు. బీజేపీ, మోదీ అవినీతిని ఇండియా కూటమి బహిర్గతం చేసి నిరూపిస్తుందని అన్నారు.

 

అదానీ గ్రూపుపై చేసిన తాజా ఆరోపణలపై రాహుల్ మాట్లాుతూ, ప్రధానమంత్రికి, ఒక నిర్దిష్ట వ్యాపారవేత్తకు ఉన్న సంబంధం ప్రతి ఒక్కరూ చూశారని, ఇదే విషయాన్ని తాను నిన్న కూడా ప్రస్తావించానని అన్నారు. జీ-20 సమావేశం జరుగనున్న తరుణంలో ప్రధాని తన విశ్వసనీయత చాటుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. దేశంలోని పేద ప్రజల సొమ్ములను కొద్ది మందికి మళ్లించడమే మోదీ ప్రభుత్వం ఐడియాగా ఉందని ఆరోపించారు

Leave A Reply

Your email address will not be published.