బీజేవైఎం కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలి

-మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో 9 ఏళ్లుగా ఉద్యోగ నియామకాలు లేక లక్షలాది మంది యువత అల్లాడుతోంది. కేసీఆర్ పాలనలో జారీ చేసిన అరకొర నోటిఫికేషన్లు సైతం తప్పుల తడక. ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి  అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేస్తే అరెస్ట్ చేయడం సిగ్గు చేటు. లీకేజీ దోషులను వదిలేసి తప్పులను ఎత్తిచూపుతున్న వారిపై కేసులు పెట్టడం కేసీఆర్ అరాచక పాలనకు నిదర్శనం. తక్షణమే బీజేవైఎం కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలి.

ఇది ప్రజాస్వామ్యం. కేసీఆర్ మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. తుగ్లక్ పాలనతో యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. తన ఇంట్లో మాత్రం అందరికీ పదవులిచ్చిన కేసీఆర్ లక్షలాది మంది యువతకు మాత్రం ఉద్యోగాలివ్వకుండా రోడ్డున పడేశారు. నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రం లీకేజీ పేరుతో ఉద్యోగాలను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. పేపర్ లీకేజీ విషయంలో టీఎస్పీఎస్సీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దల పాత్రపైనా ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కేసీఆర్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది అన్నారు.

Leave A Reply

Your email address will not be published.