పచ్చని పంట భూమిలో రక్తం చిందిస్తారు  

- మీరే సాక్షి, మీరే న్యాయవాది.. - అధికార బీజేపీపై విరుచుకుపడ్డ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నరోదాగామ్ ఊచకోత కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా సంచలన ట్వీట్ చేశారు. అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు గురువారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ, భజరంగ్‌దళ్ మాజీ నాయకుడు బాబు భజరంగి సహా మొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.నరోదా పాటియా ఊచకోత కేసులోమొత్తం 67 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై అసదుద్దీన్ స్పందించారు.మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ దివంగత కవి రహత్ ఇండోరి కవితను ఉటంకిస్తూ గుజరాత్‌లోని అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘‘మీరు వెళ్లి నిప్పు పెడతారు, మీరు ఎక్కడికి వెళ్లినా గందరగోళాన్ని సృష్టిస్తారు…పచ్చని పంట భూమిలో రక్తం చిందించే హక్కు రాజకీయాలు మీకు కల్పించాయి. మీరు అప్పీలు చేస్తారు, మీరు కేసు వాదిస్తారు, మీరే సాక్షి,మీరే న్యాయవాది. ఎవరినైనా చెడుగా మాట్లాడే స్వేచ్ఛ మీకు ఉంది, ఎవరినైనా చంపడానికి మీకు స్వేచ్ఛ ఉంది’’అని అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఒవైసీ ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.