బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సాంస్కృతిక ఆర్గనైజింగ్ సెక్రటరీగా బొమ్మిడి నరేష్ కుమార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కళారంగంలో గత 20 సంవత్సరాల నుండి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములై బిసిలను చైతన్యపరిచిన జగిత్యాలకు చెందిన నాట్య సామ్రాట్ బొమ్మిడి నరేష్ కుమార్ సేవలను గుర్తించిన బిసి సంక్షేమ సంఘం ఆయనను రాష్ట్ర సాంస్కృతిక ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ ఆదేశాల మేరకు  బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేసారు. అనంతరం బొమ్మిడి నరేష్ కుమార్ మాట్లాడుతూ బిసి సంక్షేమ సంఘం క్రియాశీల కార్యక్రమాలలో పాల్గొంటూ బిసి సంక్షేమ సంఘం కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వార బిసి ప్రజలకు మరింత చేరువకు తీసుకెల్లగలనని  పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన బిసి సంక్షేమ సంఘం జాతీయ ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణలకు కృతఙ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.