ఈనెల 19న బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బండి సంజయ్, తరుణ్ చుగ్, కేంద్ర మంత్రుల సమక్షంలో బూర నర్సయ్య బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్బంగా బూర నర్సయ్య నివాసానికి వెళ్లిన బండి సంజయ్ ను బూర నర్సయ్య ఆలింగనం చేసుకున్నారు. టీఆర్ఎస్ లో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్న బూర కేసీఆర్ కనీసం అపాయిట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహుల పార్టీగా టీఆర్ఎస్ నిలిచిపోతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. బూర చేరికతో మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమైందని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే నని బూర నర్సయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరుతున్నానని, కేసీఆర్ ను కలవటం‌ టీఆర్ఎస్ నేతలకు ఒక ఉద్యమంలా మారిందని, భువనగిరి పార్లమెంట్ అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఉందన్నారు. పార్టీలకు అతీతంగా మోదీ ప్రభుత్వం అభివృద్ధికి సహకరించింది, నా రాజకీయ జీవితం కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరుతున్నా, ఫైర్ బ్రాండ్ బండి సంజయ్, నడ్డా, అమిత్ షాలు ఆహ్వానం మేరకు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు.  సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ నినాదం నాకు నచ్చింది, ఉద్యమకారులున్న బీజేపీలోకి రావటం ఘర్ వాపసీని తలపిస్తోందని బూర నర్సయ్య పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.