బాలుడిపై వీధి కుక్కల దాడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఏడాది పసిపాప ప్రాణాలు కోల్పోయింది. అత్యంత విషాదకర ఈ ఘటన దేశ రాజధాని సమీపంలోని నొయిడాలో సోమవారం చోటుచేసుకుంది. నొయిడాలోని సెక్టార్ 100 లోటస్ బౌలేవార్డ్ అపార్ట్‌మెంట్స్ వద్ద సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాబును కుటుంబసభ్యులు చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి సోమవారం రాత్రి మృతిచెందాడని స్థానిక పోలీస్ అధికారి రజనీష్ వర్మ తెలిపారు. భవన నిర్మాణ కార్మికులైన బాలుడి తల్లిదండ్రులు.. లోటస్ బౌలేవార్డ్ సొసైటీలోనే పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

భార్యాభర్తలు తమ పని చేసిన చోటుకు సమీపంలో ఏడాది వయసున్న ఆ బాబును ఉంచారని చెప్పారు. మూడు వీధి కుక్కలు లోపలికి చొరబడి బాలుడిపై దాడిచేసింది. పలుచోట్ల కరవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ‘‘బాలుడి తల్లిదండ్రులు నిర్మాణ కార్మికులుగా ఆ సొసైటీలో పనిచేస్తున్నారు…. ఏడాది వయసున్న ఆ బాబును తమకు సమీపంగానే ఉంచారు.. ఇంతలో ఓ వీధి కుక్క లోపలికి చొరబడి బాలుడిపై దాడిచేసింది. పలుచోట్ల కరవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.. చికిత్స కోసం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశాడు’’ అని ఎస్ఐ వర్మ తెలియజేశారు.  ఇటీవల తరుచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. నిరసనకు దిగారు. కుక్కల నియంత్రణకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. వీధి కుక్కల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారని, వాటిని పట్టుకోడానికి వచ్చినవాళ్లను స్థానికులు వెళ్లిపోమంటున్నారని పోలీసులు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.