బీసీల జీవితాల్లో వెలుగు రేఖ బిపి మండల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జడ్చర్ల పట్టణం పూలే,అంబేడ్కర్  చౌరస్తా సిగ్నల్ గడ్డ దగ్గర బిందేశ్వరి ప్రసాద్ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి బీసీ సేన నేతలు ఘనంగా నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజికవేత వడ్లని శేఖర్ యాదవ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ ప్రదాత బిపి మండల్  కమిషన్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించిన దినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బీసీలందరూ మండల్ డే జరుపుకొని మహనీయుని స్మరించుకోవాలని బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  1978లో భారత ప్రధాని మొరార్జీ దేశాయ్   వెనకబడ్డ తరగతుల స్థితిగతుల అధ్యయనం కోసం   అప్పటి పార్లమెంటు సభ్యులు  బిందెశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ను చైర్మన్ గా నియమించారన్నారు. బిందెశ్వరి  ప్రసాద్ మండల్ భారత దేశ వ్యాప్తంగా పర్యటించి వెనకబడ్డ తరగతుల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పాలసీలను ,  క్షేత్రస్థాయిలో వెనకబడ్డ కులాల ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగ అంశాలపై రెండు సంవత్సరాలు అధ్యయనం చేసి 1980లో రాష్ట్రపతికి నివేదిక అందజేశారన్నారు.కాలక్రమంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా నివేదికను అమలు పరచలేదని బ్రాహ్మణ్ణే తర తొలి ప్రధానమంత్రి  విశ్వనాథ్ ప్రతాప్ సింగ్  1990 ఆగస్టు 7 తారీఖున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. మిత్రపక్ష పార్టీలైన బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు విరమించుకోగా  ప్రభుత్వం పడిపోవడం వల్ల  ప్రకటించిన ఒక రిజర్వేషన్ కూడా ప్రశ్నార్థకమైందని అన్నారు. సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత  1993 నుంచి కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగాలలో27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని  మండల కమిషన్ నివేదికలోని మిగిలిన 39  సిఫారసులను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించి   బీసీలకు చట్టసభలలో  జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ ఉపాధి, రాజకీయ,ఆర్థిక,పారిశ్రామిక రంగాలలో  60 శాతం  రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలోబీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్, రజక సంఘం జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, బహుజన నాయకులు బాల వర్ధన్ గౌడ్, దళిత మైనార్టీ ముస్లిం సంగం జాతీయ అధ్యక్షులు పకీర్ జాంగిర్ పా ష, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు టైగర్ జంగయ్య, శ్రీను బొల్లెమోని నిరంజన్, సురభి విజయ్ కుమార్,గోపాల్, మాచారం శ్రీనివాస్, లింగంపేట్ శేఖర్, చంద్రమౌళిశ్రీనివాస్ యాదవ్, మల్లికార్జున్ యాదవ్ , రామస్వామి ,కట్ట మురళి సురభి రఘు, ఆలూరు నర్సింలు,సురభి ఆంజనేయులు గంగాపూర్ బీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.