జగన్ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు

తెలంగాణ  జగన్ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కుదురైంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వ్యాన్‌పిక్‌ భూకేటాయింపుల్లో ఐఆర్‌ఎస్‌ అధికారి కె.వి. బ్రహ్మానందరెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. వ్యాన్‌పిక్‌ భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ దాఖలు చేసిన కేసును క్వాష్‌ చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో బ్రహ్మానందరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగాఅన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చిందని జస్టిస్‌ ఎంఆర్‌ షాజస్టిస్‌ రవీంద్రభట్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

 

తెలంగాణ హైకోర్టు తీర్పు ఇదే…

 

బ్రహ్మానందరెడ్డి క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జులైలో తీర్పు ఇచ్చింది. పిటిషనర్‌ బ్రహ్మానందరెడ్డిపై ఉన్న ఆరోపణలను పరిగణనలోకి… ఈ కేసులో ట్రయల్‌ అవసరం లేదని చెప్పదగ్గ కేసు కాదని… అదే విధంగా… డిశ్చార్‌ చేయాల్సిన కేసు కూడా కాదు అని తీర్పులో పేర్కొంది. పిటిషనర్‌కు వ్యతిరేకంగా… ట్రయల్‌ ఎదుర్కోవాల్సిన సాక్ష్యాలు ఉన్నాయని హైకోర్టు వెల్లడించింది. సాక్ష్యాల ఆధారంగా శిక్ష పడుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే… కింది కోర్టులో నేర విచారణను కొనసాగించాడానికి అవసరం అయిన అన్ని అంశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో సీబీఐ ప్రత్యేక కోర్టు… బ్రహ్మానందరెడ్డి క్వాష్‌ పిటిషన్‌ కొట్టేస్తూ ఇచ్చిన ఆదేశాలను తప్పుబట్టలేమని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని సుప్రీం కోర్టులో జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం తేల్చిచెప్పింది.

Leave A Reply

Your email address will not be published.