బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్ అవార్డు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి (MCH)కి “బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్- (Grade-1)” అవార్డు లబించిందని ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మెన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ లో మాతా -శిశు ఆసుపత్రిని ఏర్పాటు చేయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావుకి బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.

BFHI అక్రిడేషన్ పొందిన భారతదేశం లోని మొదటి ప్రభుత్వ ఆసుపత్రి బాన్సువాడ MCH కావడం మన అందరికీ గర్వకారణం.

బిడ్డకు తల్లి పాల ప్రాముఖ్యత అంశంలో గుర్తింపు

మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పేదల దేవుడు, రాష్ట్రశాసన సభాపతి పోచారం గారు ప్రత్యేకంగా కృషి చేసి రూ.20 కోట్లతో 100 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయించారు.

ప్రారంభించిన ఏడాదిన్నరకే BFHI అక్రిడేషన్ రావడం, అందులో దేశంలోనే ఏకైక ప్రభుత్వ హాస్పిటల్ కావడం నిజంగా గొప్ప విషయం. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్లు, నర్సులు, ఆయాలు, ANMలు, ఇతర సిబ్బందికి నా అభినందనలు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.