రికార్డ్ స్థాయిలో కూలుతున్న వంతెనలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బీహార్‌లో వంతెనలు వరుసగా కూలుతున్నాయి. దాంతో.. బిహార్‌ బ్రిడ్జ్‌ ఘటనలు దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా ఒక్క రోజులోనే సివాన్‌ జిల్లాలో మూడు చిన్న వంతెనలు కూలిపోగా.. సరన్‌ జిల్లాలో మరొకటి కుప్పకూలింది. ఫలితంగా.. 15 రోజుల్లోనే బీహార్‌లో 10 బ్రిడ్జ్‌లు కూలినట్లు అయింది. గత నెల 18 నుంచి బిహార్‌లోని కిషన్‌గంజ్‌, అరారియా, మధుబని, తూర్పు చంపారన్‌, సివాన్‌లో వరసగా వంతెనలు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో మౌలిక సదుపాయాల స్థితిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. బీహార్‌లో వంతెనలు వరుసగా కూలుతున్నాయి. దాంతో.. బిహార్‌ బ్రిడ్జ్‌ ఘటనలు దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా ఒక్క రోజులోనే సివాన్‌ జిల్లాలో మూడు చిన్న వంతెనలు కూలిపోగా.. సరన్‌ జిల్లాలో మరొకటి కుప్పకూలింది. ఫలితంగా.. 15 రోజుల్లోనే బీహార్‌లో 10 బ్రిడ్జ్‌లు కూలినట్లు అయింది. గత నెల 18 నుంచి బిహార్‌లోని కిషన్‌గంజ్‌, అరారియా, మధుబని, తూర్పు చంపారన్‌, సివాన్‌లో వరసగా వంతెనలు కూలిపోయాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో మౌలిక సదుపాయాల స్థితిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. దాంతో.. బీహార్ ప్రభుత్వం దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా ఘటనలు నమోదైన జిల్లాల అధికార యంత్రాంగాల నుంచి నితీశ్‌ సర్కార్‌ సమగ్ర నివేదిక కోరింది. నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో ఉత్తర బిహార్‌లోని నదుల నీటి మట్టాన్ని పర్యవేక్షించాలని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ.. చీఫ్‌ ఇంజనీర్లను ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.