జనవరి 3 నుంచి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు జనవరి 3 నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించాలని తలపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల ప్రిపరేషన్స్ కోసం తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించనుంది. జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో భేటీలు ప్రారంభం కానున్నాయి. తమ సమావేశాల షెడ్యూల్‌ను బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం విడుదల చేసింది.జనవరి 3న ఆదిలాబాద్‌, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి, సంక్రాంతి అనంతరం జనవరి 16న నల్లగొండ, 17న నాగర్‌కర్నూలు, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్, 20న మల్కాజ్‌గిరి, 21న సికింద్రాబాద్, హైదరాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.