మైనంప‌ల్లి వ్యాఖ్య‌ల‌ను ఖండించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావుపై మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించిన మన ఎమ్మెల్యే ఒకరు మంత్రి హరీష్ రావుపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మేమంతా హ‌రీశ్‌రావు వెంట ఉంటాం.. ఆయ‌న‌కు అండ‌గా ఉంటామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి హ‌రీశ్‌రావు ఉన్నారు. హ‌రీశ్‌రావు బీఆర్ఎస్ మూల‌స్తంభంగా కొన‌సాగుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.