దేశాయిపేట్ గ్రామంలో బుద్ధ జయంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈరోజు దేశాయిపేట్ గ్రామంలో బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త డాక్టర్ అయ్యల సంతోష్ మాట్లాడుతూ కుల,మత,వర్ణ,వర్గ,రంగు భేదం లేకుండా అన్ని జీవరాశులని, సమతా భావంతో చూడాలని, దుఃఖంలేని సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి 25 ఏళ్ల నాడు ప్రపంచ మానవాళికి మార్గదర్శకం చేశాడు సిద్ధార్థ గౌతముడు. దురాచారాలను పాటించక ఉన్నది ఉన్నట్లు చూసి, మూఢనమ్మకాలను కూడా నమ్మకుండా, ధర్మ మార్గంలో ప్రయాణించాలని సూచిస్తూ, సమత, ప్రజ్ఞ ,కరుణ, స్వేచ్ఛ, సమానత్వం ,సౌబ్రతత్వాలను ప్రతిపాదించి ,కుల ,వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకించాడు. ప్రేమ ,జ్ఞానం ,విద్య ,వైద్యం, ఐక్యతను ఆచరించాలని గౌతమ బుద్ధుడు బోధించాడాని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.