ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌కు 105 సీట్లు

-   9 ఏళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం  -      రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్‌లు పెట్టాలి   -    చెరువుగట్ల మీద రైతులతో కలిసి భోజనం చేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 9 ఏళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్‌లు పెట్టాలని, చెరువుగట్ల మీద రైతులతో కలిసి భోజనం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, వాళ్లను ప్రజలు నమ్మరని తెలిపారు. మంత్రులు జిల్లాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కు 105 సీట్లు వస్తాయని కేసీఆర్‌ జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే కర్ణాటక ఎన్నికల ఫలితాల పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఫలితాలను పట్టించుకోవద్దని సూచించారు. అక్కడ ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ బీఆర్‌ఎస్‌ విస్తృత సమావేశం జరగనుంది. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసారు.9 ఏళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్‌లు పెట్టాలని, చెరువుగట్ల మీద రైతులతో కలిసి భోజనం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, వాళ్లను ప్రజలు నమ్మరని తెలిపారు. మంత్రులు జిల్లాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పోరేషన్‌ల ఛైర్మన్‌లు హాజరయ్యారు. మధ్యాహ్నం 3.00 గంటలకు సమావేశం మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఈ ఏడాది జూన్‌ 2వ తేదీ నాటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యి, పదో ఏడు ప్రారంభం కానున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు ఈ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలపై నేతలకు దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్‌ సమావేశం ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.