రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలో రైతు భరోసా అమలుపై కేబినెట్ సబ్‌ కమిటీ భేటీ కానుంది. హైదరాబాద్‎లోని రాష్ట్ర సచివాలయంలో ఇవాళ మంత్రులు, ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు భేటీ కానున్నారు. రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ కసరత్తు చేయనుంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీని ఏడు నెలలు అయింది. అయితే మొన్నటి వరకూ లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా పలు సంక్షేమ పథకాలకు అంతరాయం ఏర్పాడింది. అయితే ప్రస్తుతం పాలనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. దీంతో కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందించే అంశంపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. అయితే ఈ హామీ అమలు చేయాంటే ప్రభుత్వం దగ్గర కౌలు రైతులకు సంబంధించిన సమాచారం, వివరాలు అందుబాటులో లేవు. అందుకే కౌలు రైతులను గుర్తించడంపై సబ్‌ కమిటీ భేటీలో చర్చ జరగనుంది. ఇప్పటి వరకు 50 వేల మంది రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు అధికారులు.10 ఎకరాల వరకు ఉన్నవారికి రైతు భరోసా ఇవ్వాలని.. నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పలు రైతు సంఘాల నుంచి ప్రభుత్వానికి కొన్ని వినతులు అందాయి. కేవలం 10 ఎకరాల వారికే కాకుండా తక్కువ పొలంలో కౌలు చేసుకుంటున్న కుటంబాలను కూడా ఆదుకోవాలని కోరారు రైతు సంఘాల నాయకులు. వారి అభ్యర్థన మేరకు 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా అందజేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ కమిటీ సమావేశం కానుంది.

Leave A Reply

Your email address will not be published.