దందా చేసి గ్యాస్ ఏజెన్సీల అనుమతి రద్దు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:. సేవా భావం తో నిర్వహించాల్సిన గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడితే ఆ ఏజన్సీ ల అనుమతులు రద్దు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.శుక్రవారం నాడు రంగారెడ్డి జిల్లా తుర్క యాంజాల్, బ్రాహ్మణ పల్లి లో కొన్ని అనుమానిత ప్రాంతాలను రఘునందన్ తనిఖీ చేశారు. ఈ సంధర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్, సిలిండర్ల అక్రమ నిల్వ అడ్డా లుగా కొన్ని షెడ్ లు మారాయన్న అనుమానం తో షెడ్ లను తనిఖీ చేసినట్టు చెప్పారు. తుర్క యాంజాల్ , బ్రాహ్మణ పల్లి, ఆదిభట్ల అటవీ ప్రాoతాల్లో గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ దందా జరుగుతోందన్న విశ్వాసనీయ సమాచారం తమకు ఉందన్నారు.వాటీ గుట్టు రట్టు చేస్తామన్నారు.గ్యాస్ ఏజెన్సీ లను బాధ్యత తో,సేవా భావం తో నిర్వహించాలన్నారు. కాని..కొందరు డీలర్లు ఏజెన్సీ నిర్వహణ బాధ్యత ను తేలిగ్గా తీసుకోవడమే గాక..ఏజన్సీల ను ఇతరులకు అప్పగించి.సేవ ను ప్రహాసహం చేస్తున్నారని రఘునందన్ ఆక్షేపించారు.కర్మన్ ఘాట్ ఐశ్వర్య గ్యాస్ ఏజెన్సీ కి చెందిన 60 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్క దారి పట్టి శంకర్ అనే వ్యక్తి కి చేరి అతను పట్టుబడటం తో అక్రమ రీ ఫిల్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందన్న విషయం బహిర్గతమయ్యిందన్నారు.సదరు గ్యాస్ ఏజెన్సీ అనుమతి రద్దు చేసే అవకాశం ఉందని రఘునందన్ స్పష్టం చేశారు.డొమెస్టిక్ గ్యాస్ ను కమర్షియల్ గా అక్రమంగా రీ ఫిల్లింగ్ చేయడం పలు ప్రాంతాల్లో జరుగుతోందన్న సమాచారం తమకు ఉందన్నారు. అక్రమార్కుల కు జైలు శిక్ష ఖాయం అని రఘునందన్ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.