ప్రతి వస్తువు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రతీ మనిషి తన నిజజీవితంలో వాడే ప్రతీ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించండి అంటూ జిల్లా వినియోగదారులు న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్. వెంకట నాగసుందర్ తెలియచేసారు.. బుధవారం విజయనగరం శ్రీ చలపతి స్కూలలో జరిగిన అడగండి – చెబుతాం అన్న కార్యక్రమంకి ముఖ్య అతిగా విచ్చేసి విద్యార్థుల నిద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలోఎన్నో చోట్ల వినియోగదారులుకు జరుగుతున్న అన్యాయం పై అయన మాట్లాడుతూ,, వినియోగదారులు కు సేవలు అందించేందుకు జిల్లా వినియోగదారుల నాయస్థానం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది అని తెలియచేసారు..

కల్తీలను -అరికట్టాలి. డా. హరిబాబు

ప్రస్తుతము మనిషి నిజ జీవితంలోనకిలీ ఆహారపదార్ధాలు ను తింటూ అనారోగ్యం పాలౌతున్నారు అంటూ సిసిఐ నేషనల్ వయిస్ ప్రెసిడెంట్ డా. చదలవాడ హరిబాబు తెలియచేసారు.. విజయనగరం జిల్లాలో 2 రోజులు పాటు నిర్వీహిస్తున్న, అడగండి – చెబుతాం అన్నకార్యక్రమంలో భాగంగా కల్తీ,తునికలు కొలతలు లో మోసాలు విషయం పై అవగాహనా సదస్సును  విజయనగరం శ్రీ చలపతి హైస్కూల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ప్రతీ మనుషులు నిత్యం తింటున్న పాస్ట్ ఫుడ్ లో ఎలాంటి కల్తీ పదార్ధాలు కలుస్తున్నాయి. ప్రస్తుతం నిత్యావసర ఆహార వస్తువులు కల్తీ ఎలాగ జరుగుతుంది. తద్వారా మనం  మన జీవితంలో ఎలా ఆరోగ్యం చెడగొట్టుకొని మోసపోతున్నాం అన్న విషయాలు విద్యార్థులకు తెలియచేసారు..ఈ కార్యక్రమం లోఐహెచ్ఆర్ఏ సివిల్ రైట్స్ ఆంధ్ర ప్రదేశ్ చర్మెన్ కరణం తిరుపతి నాయుడు, కన్స్యూమర్ వెల్ఫేర్ సొసైటీ విజయనగరం జిల్లా అద్యక్షులు  ఎం ఎస్.శ్రీనివాస్,శ్రీకాకుళం జిల్లా కన్స్యూమర్ వెల్ఫేర్ సొసైటీ అద్యక్షులు బుర్గపు రాజేశ్వర్ రావు , శ్రీ చలపతి స్కూల్ అధినేత కోరాడ రాజేష్ వారి సిబ్బంది పాల్గొన్నారు. అదేవిదంగా జిల్లా జడ్జి చేతులు మీదుగా గోడ పత్రిక విడుదల చేసారు.ఈ కార్యక్రమం కన్స్యూమర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిందని ఎం.ఎస్. శ్రీనివాస్ రావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.