నగదు పోయిందా!..యూపీఐ లావాదేవీ రివర్స్ ఎలా?

  గూగుల్ పే, ఫోన్ పేటీఎం తదితర వినియోగదారులు ఏం చేయాలి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ (యూపీఐ) పరిచయమైన దగ్గర్నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం వచ్చిందనే చెప్పాలి. ఎంతో సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కలిగింది. అయితే అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లతో ఈ యూపీఐ లావాదేవీల్లోనూ ఇబ్బందిపడుతున్న సంఘటనల్ని చూస్తున్నాం. ముఖ్యంగా ఒకరికి బదులుగా మరొకరికి నగదును బదిలీ చేయడం, యూపీఐ ఐడీ, మొబైల్ నంబర్స్ తప్పుగా టైప్ డబ్బు పంపడం, ఇతరత్రా అనధికారిక పేమెంట్స్ ద్వారా నష్టపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు సదరు యూపీఐ లావాదేవీని వెనక్కి తీసుకోవడానికి బాధితులు, నష్టపోయినవారు ఏం చేయాలో చూద్దాం.

నిజానికి క్షణంలో పూర్తయ్యే ఈ యూపీఐ లావాదేవీల్లో ఒక్కసారి నగదు బదిలీ అయిపోతే దాన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టమే. అందుకే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ ‘యూపీఐ ఆటో-రివర్సల్’ వ్యవస్థను తీసుకొచ్చింది. కానీ దీనిపై కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మీ యూపీఐ లావాదేవీని రివర్స్ చేయడానికి మీరు విజ్ఞప్తి చేసుకోవచ్చు.

ఇలా చేయండి..

ఒకవేళ మీరు పొరపాటున నగదును పంపించింది బంధువులు, స్నేహితులు లేక తెలిసినవారికో అయితే వారికి కాల్ చేసి జరిగిన విషయాన్ని వివరించండి. ఆ నగదును తిరిగి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేయండి.

మీ ప్రమేయం లేకుండా నగదు లావాదేవీ జరిగినట్టు మీ దృష్టికి వస్తేవెంటనే మీకు ఖాతా ఉన్న బ్యాంక్ శాఖకులేదా మీ యూపీఐ సర్వీస్ ప్రతినిధులకు తెలియజేయండి. ఇది చాలాచాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి. అలాగే లావాదేవీ రిఫరెన్స్ నంబర్తేదీచెల్లించిన మొత్తం వివరాలను బ్యాంక్ ఇవ్వండి. ఆలస్యం చేసినకొద్దీ నష్టపోయే అవకాశాలు పెరుగుతాయన్నది మరువద్దు.

మీ లావాదేవీ షరతులకు లోబడి ఉంటే, మీ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ (గూగుల్ పే, ఫోన్ పేటీఎం తదితర పేమెంట్ యాప్స్) అంగీకరిస్తే యూపీఐ ఆటో-రివర్సల్ ప్రక్రియ ఆరంభమవుతుంది. అయితే ఇది పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితే మీ బ్యాంక్ లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీకు ధ్రువీకరణ వస్తుంది. ఈ పని విజయవంతమైతే మీ ఖాతాలో సదరు నగదు మొత్తం తిరిగి జమవుతుంది.

చివరగా..
ఎవరికైనాసరే నగదును పంపే ముందు అన్ని వివరాలను నిశితంగా గమనించండి. అలాగే యూపీఐ లావాదేవీ పెండింగ్ లేదా ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మీ ఖాతా నుంచి తగ్గిన మొత్తం మళ్లీ తిరిగొచ్చేందుకు అవకాశం ఉంటుంది. విజయవంతమైన లావాదేవీని తిరిగి వెనక్కి తీసుకోలేము. ఇక యూపీఐ పిన్ నంబర్ భద్రంగా ఉంచుకోవాలి. ఎవరికీ తెలియజేయరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మన వాళ్లెవరికైనా పిన్ తెలియజేసినైట్టెతే సదరు లావాదేవీ ముగిసిన వెంటనే ఆ పిన్ నంబర్ మార్చి కొత్తదాన్ని సెట్ చేసుకోవాలి.

Leave A Reply

Your email address will not be published.