ఘనంగా పీవోడబ్ల్యూ ఆర్ధ శతాబ్ది వార్షికోత్సవాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 1974 జూన్ 22 న ఏర్పడి వివిధ కారణాల వల్ల చీలిపోయిన పీవోడబ్ల్యూ నాలుగు సంఘాలన్ని ఒక్కటిగా ఏర్పాటు చేసి22 జూన్ 2024 న  పీవోడబ్ల్యూ ఆర్ధ శతాబ్ది వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ వెల్లడించారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూఆర్ధ శతాబ్ది వార్షికోత్సవాలలో బాగంగా ఏడాది పాటు కామన్ సివిల్ కోడ్, ఫాసిజం, మహిళల హక్కులు అణచివేత, విద్య కాషాయీకరణ, మహిళల సమస్యలు తదితర అంశాలపై సదస్సులు, సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జాతీయత, దేశభక్తి ముసుగులో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడంతో పాటు దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పరంపర కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు సంఘటితమై సమస్యలను పరిష్కరించుకుని హక్కులను సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. దేశంలోని మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు కె.సంధ్య, ఎం.లక్ష్మి, స్వరూప, అంబిక, శిరోమణి, దీప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.