ఆలీ కుమార్తె వివాహంలో సెలబ్రిటీల సందడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు ఆలీ (Ali) పెద్ద కుమార్తె ఫాతిమా (Fathima) వివాహం ఘనంగా జరిగింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి – సురేఖ, నాగార్జున – అమల దంపతులు, ఏపీ మంత్రి రోజాతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను రోజా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. నెటిజన్లు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.