బీహార్ లో బీసీల లెక్క తేలింది..తెలంగాణలో కులగణన ఇంకెప్పుడు?     

 బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: బీహార్ లో బీసీల లెక్క తేలిందని.. తెలంగాణలో కూడా తక్షణమే కులగణన చేపట్టాలని కాచిగూడాలోని మున్నురుకాపు సంఘం లో  బీసీ కోర్ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం  మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం బీసీ కులగరణ అంశాన్ని దాటవేసిన నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కులగన చేపట్టి బీసీ జనాభా 63 శాతం ఉందని తేల్చిందన్నారు. ఇదే ప్రామాణికన తీసు కుంటే రాష్ట్రంలో బీసీ జనాభా 57 శాతం పైగాఉంటుందని, అన్ని తెలిసే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ను బహిర్గతం చేయడం లేద న్నారు. రెడ్డి,రావులు నాలుగు శాతం లోబడి ఉన్నారని విషయం తెలిస్తే వచ్చే రాజ్యాధికార ఉద్యమం తీవ్రతరం అవుతుం దని, భయంతో కులగనన అంశా న్ని తొక్కి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తెలంగాణలో కులగ ణన కోసం తెలంగాణ బీసీ కమిషన్కు బాధ్యత అప్ప గించి తెలంగాణలో బీసీ లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటుపల్లి సురే ష్, తెలంగాణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ జలపల్లి కిరణ్, హైదరాబాద్ గ్రేటర్ ఉపాధ్యక్షులు పండరినాథ్, జయరాజ్, బీసీ కోర్ కమిటీ మెంబెర్స్, విద్యార్థి నాయ కులూ, యువజన విభాగం, మహిళా విభాగం, బీసీ జేఏసీలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.