యూపీఐ డిజిటల్ పేమెంట్స్‌కు కేంద్రం ప్రోత్సాహాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గతంలో ఏదైనా ఫీజు పే చేయాలన్నా.., కరంట్ బిల్లు కట్టాలన్నా.. డీడీలు, చలాన్లు కట్టాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సిందే.. కాల క్రమేణా ఆన్‌లైన్ లావాదేవీలు.. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత మొబైల్ యాప్స్‌లోకి మారిపోయాయి. ఇప్పుడు ఏ చెల్లింపులు చేయాలన్నా ‘యూపీఐ’తోనే జరిగిపోతున్నది. రోజువారీ అవసరాలకు ‘డెబిట్ కార్డు’తో ఏటీఎంకెళ్లి విత్ డ్రా చేసుకునే వారం.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. ఫోన్ పే, జీ-పే, పేటీఎం తదితర యాప్స్‌లోనే ప్రతి పేమెంట్స్ పూర్తవుతున్నాయి. రోజురోజుకు ఈ కామర్స్ పేమెంట్స్ పుంజుకోవడంతో చాలా మంది ఆన్ లైన్ పేమెంట్స్ కోసం యూపీఐ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.గతేడాది ఏప్రిల్’లో ఈ-కామర్స్ డెబిట్ కార్డ్ ఆధారిత చెల్లింపులు 11.70 కోట్లుగా ఉంటే.. గత నెలాఖరు నాటికి 5.1 కోట్లకు దిగి వచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి గత నెలాఖరు వరకూ రూ.21 వేల కోట్ల నుంచి రూ.16,127 కోట్లకు తగ్గిపోయాయి. మరోవైపు, మర్చంట్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ 220 కోట్ల నుంచి 610 కోట్లకు పెరిగాయి. కొద్ది మొత్తం పేమెంట్స్ కోసం అత్యధికులు యూపీఐ పేమెంట్స్ కే మొగ్గు చూపుతున్నారు. భారీ మొత్తం లావాదేవీలు మాత్రం నెట్ బ్యాంకింగ్‌లో పూర్తి చేస్తున్నారు.గతేడాది ఏప్రిల్‌లో ఈ-కామర్స్ రంగంలో క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్లు 10.7 కోట్లు ఉంటే.. గత నెలాఖరు నాటికి 13.1 కోట్ల (22 శాతం గ్రోత్) కు పెరిగాయి. ఆయా లావాదేవీల విలువ కూడా రూ.65,652 కోట్ల నుంచి రూ.92,878 కోట్లకు పెరిగింది.ఆఫ్ లైన్ స్టోర్లలో డెబిట్ కార్డు పేమెంట్స్ తగ్గినా.. ఇప్పటికీ గణనీయ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఆఫ్ లైన్ స్టోర్లలో డెబిట్ కార్డులను స్వైప్ చేస్తున్న వారి సంఖ్య గతేడాది ఏప్రిల్ లో 213 మిలియన్లు ఉంటే.. గత నెలలో 132 మిలియన్లకు తగ్గింది. యూపీఐ పేమెంట్స్‌లో సరళత్వం, క్రెడిట్ కార్డులపై ఆఫర్లతోపాటు డిజిటల్ పేమెంట్స్‌కు కేంద్రం ప్రోత్సాహాలు అందిస్తుండటంతో యూపీఐ పేమెంట్స్ పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.