సామాజిక వర్గాలకు న్యాయం చేయటం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజకీయంగా సామాజిక వర్గాలకు న్యాయం చేయటం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రత్యామ్నాయ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ నాగుల శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.శుక్రవారం వివిధ కుల సంఘాలు, వివిధ ప్రజాసంఘాలు, వివిధ జేఏసీ రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున సమావేశమైనారు.ఈ సమావేశం లో  సామాజిక 50 వరకు కుల సంఘాలు సమావేశం కావడం జరిగింది.ఉదయం నుండి సాయంత్రం వరకు రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగింది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ భౌగోళికంగా కాంగ్రెస్ పార్టీ కావున రాబోయే ఎన్నికల్లో సామాజిక తెలంగాణకు అంకుర్రాపణ చేయాలని పిలుపు నిచ్చారు. అందరూ భాగంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయించి సామాజిక న్యాయం చేసే దిశగా  అడుగులు వేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసారు. అదేవిధంగా ప్రజల ముంగి టన రాజకీయ అధికారాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి విజ్ఞత కలిగిన తెలంగాణ మరియు సామాజిక కుల సంఘాలపై ఉందని అన్నారు. ఈ సమావేశంలో ట్రేడింగ్ నాయకులు గొల్లపల్లి దయానందరావు, టి ఎస్ ఆర్ ఎస్ అధ్యక్షులు పోకల కిరణ్ మాదిగ, బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు చీమల జగదీష్ యాదవ్, మాల మహానాడు అధ్యక్షులు పివి మోహన్, తమిళ సంఘం అధ్యక్షులు వెంకట్రావు, తెలంగాణ క్రిస్టియన్ సంఘం అధ్యక్షులు డేనియల్ ,ఓయూ జేఏసీ ప్రెసిడెంట్ జనగాం రాజేశ్వరరావు ,బీసీ సంఘం అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు, మహిళా సంఘం అధ్యక్షులు జి విజయ కుమారి, నంది కంటి సాయికుమార్, వినోద్ ,సంచార జాతులువెంకటస్వామి, బొడిగజంగం అధ్యక్షుడు వెంకటస్వామి, యాదవ సంఘం అధ్యక్షులు యాదగిరి యాదవ్, సంపత్ కుమార్ గౌడ్, జగన్మోహన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.