కామన్ సివిల్ కోడ్ తో ప్రజల మధ్య ద్వేషం పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కామన్ సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తున్న తెలంగాణ రాష్ట్ర మైనారిటీ/ దూదేకుల తెలంగాణ రాష్ట్ర అధికార  ప్రతినిధి ఎం.ఏ. ఖదీర్ పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న సివిల్ కోడ్ ను అన్ని మతాలవారు అయోమయంలో పడ్డారని  అన్నారు. బి.జె.పి .దేశాభివృద్ధి ని విస్మరించి విద్వేష పూర్వకంగా రాజకీయం చేస్తూ ప్రజల మధ్య ద్వేషం పెంచుతుంది అన్నారు. భిన్నత్వంలో,  ఏకత్వం ఉన్న భారతదేశంలో యు. సి. సి. పేరుతో బి.జె.పి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెడుతుందన్నారు. భారత దేశంలోని పౌరుల వివాహాలు,  విడాకులుఆస్తిపంపకాలపై ఈ చట్టం ప్రభావం చూపుతుందన్నారు. రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగ  కమిటీలో యు .సి. సి. పై విస్తృతంగా చర్య   జరిగిందన్నారు. భారతదేశ పరిస్థితులను బట్టి వైవిధ్యం ఉన్న దేశంలో ఒకేసారి ఒకే చట్టం అమలు సరికాదని భావించిన రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయాన్ని ఆదేశిక సూత్రాలతో పొందుపరిచినవారు అన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 36 నుంచి 51 పురుషులకు స్త్రీలకు సమాన ఆదాయం వచ్చేలా చూడడం విద్యా వైద్యం ఉచితంగా అందరికీ అందించడం వంటి ఎన్నో ఉన్నాయన్నారు. రాజ్యాంగ సభలో కూడా5-4 ఓట్లతో యు సి సి ప్రాథమిక హక్కు హోదాను కోల్పోయింది అన్నారు. అవసరం వస్తే పర్సనల్ చట్టాలు రాష్ట్రాన్ని బట్టి మార్చుకోవచ్చు అన్నారు. కానీ దేశం అంతటా ఒకే చట్టం కోరుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్ల పాలనలో ప్రజలకు ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెట్టిప్రాజెక్టులు నిర్మించి,  మిషన్ భగీరథ లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ప్రతి ఇంటికి ఒక పథకం వర్తించేలా చూస్తున్నటువంటి ప్రభుత్వం కె.సి. ఆర్ గారి ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు యావత్తు దేశ ప్రజలు చూస్తున్నటువంటి పరిపాలన కె.సి.ఆర్ గారి పరిపాలన  అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ బాబా ఫక్రుద్దీన్నల్లగొండ అధ్యక్షులు ఆజం ,గౌరవ అధ్యక్షులు అజీజ్ బషీర్ యూసుఫ్ సలీం అంజత్ రజాక్ షఫీఅహ్మద్పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.