మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ నాణ్యతపై కేంద్ర బృందం విచారణ

   రంగంలోకి దిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ నాణ్యతపై కేంద్ర బృందం విచారణ నిర్వహించింది. క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు రంగంలోకి దిగారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటిస్తోంది. మేడిగడ్డలో కుంగిన పిల్లర్స్ ను నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించారు. మరికాసేపట్లో హైదరాబాద్ జల సౌధాలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో భేటీ జరగనుంది. జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో భేటీ కానున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో చర్చ నిర్వహించనున్నారు. సాంకేతిక వివరాలను కేంద్ర బృందం అడిగి తెలుసుకోనుంది. భేటీ తరువాత కేంద్రానికి తమ నివేదికను కేంద్ర బృందం సమర్పించనుంది.

Leave A Reply

Your email address will not be published.