నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ప్రభావంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ము లుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లంద, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ వచ్చు..

 

సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ. , సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

ఈ నెల 19 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం కురుస్తుంది.

అలాగే కరీనానగర్, పెద్దపల్లి, భువనగిరి, భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.