చంద్రబాబు కొత్త పార్టీ పెట్టాలనుకున్నారు

.. లక్ష్మీ పార్వతి సంచలనం వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  చంద్రబాబు ఎన్టీయార్  పార్టీని టేకోవర్ చేశారు తప్ప ఆయన సొంతంగా పార్టీ పెట్టారా అది ఆయనది కాదు అని ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలు చేస్తూంటారు. అయితే చంద్రబాబు కూడా ఒకానొక సమయంలో కొత్త పార్టీ పెట్టాలనుకున్నారట. ఆ విషయాలను ఎన్టీయార్  భార్య లక్ష్మీ పార్వతి చెబుతూ సంచలనం రేకెత్తించారు. 1995 ఎన్నికలకు ముందు టీడీపీని చీల్చి చంద్రబాబు కొత్త పార్టీని పెట్టాలని చూశారని ఆమె ఘాటైన ఆరోపణలు చేశారు.
బాలయ్య అన్ స్టాపబుల్ రియాల్టీ షోలో చంద్రబాబు ఎన్టీయార్  వెన్నుపోటు ఎపిసోడ్ మీద మాట్లాడిన దానికి లక్ష్మీ పార్వాత్రీ భారీ రియాక్షనే ఇచ్చారు. ఆ షోలో చంద్రబాబు చెప్పినవి అన్నీ అబద్ధాలే అని మండిపడ్డారు. ఆనాడు ఎన్టీయార్  పదవి లాక్కున్నది చంద్రబాబు మోసం చేసినది కూడా వారే. ఇపుడు తప్పు తమది లేదని చెబుతున్నారని ఆమె అన్నారు.
ఇక చూస్తే  చంద్రబాబు అధికార దాహం ఎక్కువని టీడీపీ ద్వారా గెలిచిన  దాదాపు 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేశాడని అదే విషయాన్ని ఎన్టీఆర్ నాకు తెలియజేశారని లక్ష్మీపార్వతి అన్నారు. అంత కాదు 1995లో రాజకీయ సంక్షోభం సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శకుడు దాసరి నారాయణరావు మెగాస్టార్ చిరంజీవిని కలిశారని వైసీపీ నేత లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వారితో కలసి కొత్త పార్టీ పెట్టడానికి బాబు పధక రచన చేశారని ఆమె ఆరోపణలు చేయడం విశేషం. 1995 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్పై చంద్రబాబు కుట్ర పన్నారని . టీడీపీపై ఎన్టీఆర్పై తనపైన  కావాలనే తప్పుడు ప్రచారం చేశారని ఆమె అంటున్నారు  ఒక విధంగా ఎన్టీయార్ చనిపోవడానికి కూడా చంద్రబాబే కారణం అని ఆమె విమర్శించారు. ఇన్ని చేసిన చంద్రబాబు తనకు ఏమీ తెలియదు అని రియాల్టీ షొలో పచ్చి అబద్ధాలే చెప్పారని ఆమె ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా ఈ షో హోస్ట్ చేసిన బాలయ్య కూడా అబద్ధాలు చెప్పారని ఆయన అంటే తనకు ఇప్పటిదాక ఉన్న అభిమానం పోయి అసహ్యం వేస్తోందని ఆమె పరుషమైన పదాలే వాడారు.తన బావను రక్షించే క్రమంలో బాలయ్య కూడా ఎన్టీయార్ దే తప్పు అనడమేంటని ఆమె నిలదీశారు. బాలయ్య ఎన్టీయార్  కొడుకుగా ఉండి ఇలా చేయవచ్చా అని ఆమె మండిపడ్డారు. ఈ షోలో చంద్రబాబుని రక్షించడానికి బాలయ్య ఎంత చేసినా అసలు అన్ని వాస్తవాలు సోషల్ మీడియాలోనే ఈ రోజుకీ ఉన్నాయని ఆమె అనడం విశేషం. అంతే కాదు అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ చంద్రబాబు ఇద్దరూ మాట్లాడినవన్నీ అబద్ధాలు అని ఆమె ఒక్క ముక్కతో ఖండించి పారేశారు.తన దృష్టిలో చంద్రబాబే కాదు బాలయ్య కూడా ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచారని ఇద్దరు తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఒకరికి ఒకరు సపోర్టు చేసుకుంటున్నారని ఆమె అన్నారు.  ఇదిలా ఉంటే ఎన్టీయార్ వెన్నుపోటు ఇష్యూలో  ఇపుడు చిరంజీవిని కూడా లక్ష్మీ పార్వతి తెచ్చారు. 1995లోనే చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని భావించారా. చంద్రబాబు నిజంగా ఆయన్ని కలిశారా. అసలు తెర వెనక ఏమి జరిగింది ఇవన్నీ కొత్త ప్రశ్నలే. మొత్తానికి అన్ స్టాపబుల్ కాదు కానీ వెన్నుపోటు మీద అన్ స్టాపబుల్ గా అలా కధనాలు వస్తూనే ఉన్నాయని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.