నిబంధనల బంధనాలు తెంచేసిన చంద్రబాబు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: టిడిపి ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో వైసిపి నేతల మధ్య ప్రకంపన‌లు రేపుతోందని చెప్పాలి. దిమ్మ తిరుగుతోంది బాసు అని వైసీపీ నాయకులు ఒకరికొకరు చెప్పుకోవడం రోజు రోజంతా కనిపించింది. మహానాడు ముగిసిన రెండో రోజు నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాత్రివేళ ఈ మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఇక అప్పటినుంచి కూడా 24 గంటల పాటు ఏ ఇద్దరు వైసీపీ నేతలు ఫోన్లు చేసుకున్నా.. `అదిరిపోతోంది బాసు. మన మేనిఫెస్టో కొన్నా కూడా ఇది ఏదో అద్భుతంగా ఉన్నట్టు ప్రజల్లో చర్చ జరుగుతుంది బాసు“ అనే చర్చ జోరుగా సాగింది.
దీన్ని బట్టి ఈ మినీ మేనిఫెస్టో వైసిపి నేతల్లో కలవరం రేపింది అనేటటువంటి చర్చకు దారితీసింది. నిజానికి ఇప్పటివరకు కూడా సంక్షేమ‌ పాలన‌ అందిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. సంక్షేమంలో తమ తిరుగులేదని వైసీపీ నేతలు, వైసీపీ ప్రభుత్వం బలంగా చెబుతూ వస్తోంది. అయితే ఈ దఫా చంద్రబాబు నాయుడు `అభివృద్ధి ప్లస్ సంక్షేమం` ఈ రెండిటికీ కూడా  ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా సంక్షేమ ఓటు బ్యాంకుపై క‌న్నేశారు. ఇప్పటివరకు ఏదైతే సంక్షేమాన్ని పట్టుకొని వైసిపి ఓటు బ్యాంకుగా మార్చుకుందో.. ఆ సంక్షేమాన్ని తన వైపు తిప్పుకునేందుకు సంక్షేమ పథకాలకు పెద్ద పేట వేశారు.
2019 ఎన్నికల సమయంలో సంక్షేమానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం వైసిపి అనుసరిస్తున్నటువంటి విధానాలను సూక్ష్మంగా గమనించి ప్రజల నాడిని  పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. జనాల్ని తన‌వైపు తిప్పుకోవడం, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గ్రామీణ ఓటు బ్యాంకును టిడిపి నుంచి చేజారి పోకుండా గట్టిగా ప్రయత్నం చేశారని ఈ మేనిఫెస్టో స్ప‌ష్టం చేసింది. దీంతో వైసిపి నేతల్లో కలవరం ప్రారంభమైందనే చెప్పాలి.
ఎందుకంటే ఇంతకన్నా ఎంత మేనిఫెస్టో ఇచ్చినా కూడా ఇంతకు మించి ఇచ్చేటటువంటి అవకాశం వైసీపీకి కూడా కనిపించడం లేదు. పైగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా అమలు చేస్తున్నామని చెప్తున్న పథకాలకు సంబంధించి అనేక నిబంధనలు అనేక కొర్రీలు వేశారు. ఎంతోమంది లబ్ధిదారులను దూరం చేశారు. పింఛన్ పెంచామని చెప్పినప్పటికీ కూడా చాలామందికి గ్రామీణ స్థాయిలోనూ పట్టణ స్థాయిలోనూ నగరాల స్థాయిలో ఇంట్లో రెండు పింఛన్లు ఉన్నాయి అని చెప్పి ఒకటి తొలగించారు.  అదే విధంగా అమ్మ ఒడి వస్తుందని చెప్పి ఇతర పథకాలు తొలగించారు.
ఇంట్లో టాక్సు కడుతున్నారని కార్లు ఉన్నాయని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఇలా అనేకమైనటువంటి నిబంధనలు పెట్టి సంక్షేమాన్ని దూరం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది.  కాబట్టి ప్ర‌జ‌ల వేద‌న‌ను టిడిపి బాగా అర్థం చేసుకొని ఎలాంటి నిబంధనలు లేకుండా  సంక్షేమాన్ని అందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం నిజంగానే వైసిపి నేతల్లో కలవరాన్ని డెవలప్ చేసింది. దీనిని బట్టి ఇప్పుడు వైసీపీ నాయకులు తమలో తాము తర్జనభర్జన పడుతున్నారు. వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడం.. జగన్ 30 ఏళ్ల పాటు సీఎం గా ఉండాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు ప్రకటించినటువంటి టిడిపి మేనిఫెస్టో వైసీపీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంద‌న‌డంలో సందేహం లేదు.

Leave A Reply

Your email address will not be published.