చంద్రబాబు నెత్తిన పాలు పోసిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన వల్ల జాతీయ స్థాయిలో ఆయనకు కొత్తగా ఏమి ఓరుగుతుందో తెలియదు కానీ ఆ ప్రకటన చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లు అయింది. దాంతో ఎన్నడూ లేని విధంగా బాబు తెలంగాణా టీడీపీ మీద ఫోకస్ ఫుల్ గా పెడుతున్నారు. తాజాగా జరిగిన తెలంగాణా పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు వారంలో అయిదు రోజులు తాను తెలంగాణా నేతలకు అందుబాటులో ఉంటాను అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇది నిజంగా చంద్రబాబులో వచ్చిన సరికొత్త మార్పుగా భావిస్తున్నారు.ఏపీలో పార్టీ వ్యవహారాలకే చంద్రబాబు పరిమితమై తెలంగాణాలో వారంతంలో హైదరాబాద్ వచ్చినా తెలంగాణా పార్టీ నేతలను కూడా పట్టించుకోనంత బిజీగా ఒకపుడు బాబు ఉండేవారు. కానీ ఇపుడు ఆయనకు తెలంగాణాలో చాలా హోప్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు పార్టీ ఇక పరుగులు తీయాల్సిందే అని చెబుతున్నారు. అంతే కాదు తెలంగాణాలో తెలుగుదేశం చేసిన అభివృద్ధే ఇపుడు ఎక్కడ చూసినా ఉందని అంటున్నారు.దానికి చెప్పుకోవడంలో  విఫలం కావడం వల్లనే నేతలు దూరం అయ్యారని పార్టీ కూడా వెనకబడిందని అంటున్నారు. అదే టైం లో పార్టీలోకి కొత్త రకంగాన్ని యువ నేతలను తీసుకుని వస్తామని చంద్రబాబు అంటున్నారు. పార్టీ కోసం ఎవరు వచ్చినా చేర్చుకోవాల్సిందే అని సీనియర్ నేతలకు బాబు సూచించారు. అంతే కాదు ఒక్కో కార్యకర్త పది మంది దాకా కార్యకర్తలను పార్టీలో చేర్పించాలని కొత్త టార్గెట్లు బాబు విధించారు.తెలంగాణాలో పార్టీ విస్తరణకు ఇదే సమయం అని బాబు భావిస్తున్నారు. ఆ మధ్యన అయ్తిఏ తెలంగాణాలో తాను విస్తృతంగా పర్యటిస్తాను అని బాబు చెప్పారు. ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తాను అన్నారు. ఇపుడు బాబు జోరు చూస్తూంటే ఆయన తెలంగాణా అంతటా రానున్న రోజులలో  పెద్ద ఎత్తున టూర్లు వేయబోతున్నారు అని అంటున్నారు. ఒక విధంగా కేసీయార్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలోనే బాబు ఉన్నారని అంటున్నారు.కేసీఆర్ పనిగట్టుకుని 2019 ఎన్నికల్లో తనను ఏపీలో ఓడించడానికి జగన్ కి పూర్తి సాయం అందించారు అన్న మంట బాబులో బాగా ఉంది. ఇపుడు కేసీఆర్ బీయారెస్ పెడుతున్నారు కాబట్టి తెలంగాణాలో టీడీపీ విస్తరణను అడ్డుకోలేరు. దాంతో బాబు తనదైన చాణక్య వ్యూహాలను బయటకు తీసి 2023 ఎన్నికల్లో ఓడించడానికి చూస్తారని అంటున్నారు. తెలంగాణాలో టీయారెస్ ఓడితేనే తప్ప  టీడీపీకి పూర్వ వైభోగం రాదు. దాంతో బాబు ఇపుడు అదే పనిలో ఉన్నారని ఆయన వైఖరి తెలియచేస్తోంది అంటున్నారు. చంద్రబాబు పరిస్థితులు బాగా లేనపుడు కొంత తగ్గుతారు. అంతమాత్రాన ఆయన ఏకంగా వెనకబడిపోయినట్లు కాదు. ప్రత్యర్ధులు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చంద్రబాబు మనస్తత్వం ఎపుడూ ఓటమిని అంగీకరించదు. అందుకే ఆయన మరోసారి తెలంగాణాలో టీడీపీని గట్టిగానే  లేపాలని చూస్తున్నారు. టీడీపీ పుట్టిన చోట పార్టీకి మంచి రోజులు తప్పకుండా వస్తాయని తీసుకురావాలని చంద్రబాబు బాగా  పట్టుదల మీద ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.