భూమి, చంద్రున్ని ఫోటో తీసిన చంద్ర‌యాన్‌-3.. పిక్స్ షేర్ చేసిన ఇస్రో

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కొన్ని రోజుల క్రితం చంద్ర‌యాన్‌-స్పేస్‌క్రాఫ్ట్‌ను భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నింగిలోకి పంపిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స్పేస్‌క్రాఫ్ట్ తీసిన ఫోటోల‌ను ఇవాళ ఇస్రో రిలీజ్ చేసింది. చంద్ర‌యాన్‌-3లో ఉన్న ల్యాండ‌ర్ ఇమేజ్ కెమెరాల నుంచి భూమిని ఫోటో తీశారు. ఇక ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి క‌క్ష్య‌లోకి వెళ్లిన త‌ర్వాత చంద్రుడి ఫోటోను కూడా తీసింది. ల్యాండ‌ర్ హారిజంట‌ల్ వెలాసిటీ కెమెరా ఆ ఫోటోను క్లిక్ అనిపించింది. చంద్ర‌యాన్‌-3 విజ‌య‌వంతంగా ఆగ‌స్టు 5వ తేదీన చంద్రుడి క‌క్ష్య‌లోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. ఆగ‌స్టు 23వ తేదీన ల్యాండ‌ర్ చంద్రుడిపై దిగే అవ‌కాశాలు ఉన్నాయి. చంద్రుడి ఫోటోలో క్రాట‌ర్స్ స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఎడ్డింగ్ట‌న్‌అరిస్టార్‌చ‌స్‌పైతాగ‌ర‌స్‌ఓసియ‌న్ ప్రొసెల్ల‌ర‌మ్ లాంటి బిల్హాలు ఆ పిక్‌లో క‌నిపించాయి. చంద్రుడి ఉత్త‌ర ద్రువంలో ఉన్న బిల్వాల్లో.. ప్రొసెల్ల‌ర‌మ్ చాలా పెద్ద‌ది. అది సుమారు 2500 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దాదాపు 4 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల దూరాన్ని క‌వ‌ర్ చేస్తుంది.

Leave A Reply

Your email address will not be published.