రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు

- అర్ 5 జోన్‌ ప్రభుత్వం ఏర్పాటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులుచేర్పులు చేస్తూ అర్ 5 జోన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్ 5 జోన్ ఏర్పాటుపై గతంలో రాజధాని రైతులు హైకోర్టుకు వెళ్లారు. గ్రామ సభల అభిప్రాయాలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది. రాజధానిలోని ప్రతి గ్రామం ఏకగ్రీవంగా ఆర్ 5 జోన్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా స్పెషల్ ఆఫీసర్ల సాయంతో ప్రభుత్వం అర్ 5 జోన్‌ను ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో ఆర్ 5 జోన్‌లో జగన్ సర్కార్ పనులను ప్రారంభించింది.అర్ జోన్ లో 47 వేల మందికి సెంట భూమిని జగన్ సర్కార్ కేటాయించింది. ఆర్ జోన్ లో సెంటు భూమిని కేటాయించడంపై రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తుది తీర్పుకు లోబడి పట్టాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. సెంటు స్థలంలో నిర్మాణాలకు చట్టబద్ధతన్యాయబద్ధత ఉండవంటూ వెల్లడించింది. అలాంటి స్థలాల్లో ఇల్లు నిర్మించేందుకు కేంద్రం కేటాయించిన 700 కోట్లు రైతుల అభ్యంతరాలతో కేంద్ర గృహ నిర్మాణ శాఖ వెనక్కి తీసుకుంది. కోర్టు తీర్పు ఎలా ఉన్న తాము ముందుకే వెళతామంటూ ఆ స్థలాల్లో నేడు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే అక్కడ నిర్మించే నిర్మాణాలకు చేసినా ఖర్చు వృథా అవుతుంది. జగన్ రాకను నిరసిస్తూ నల్ల బేలున్లతోజండాలతో శిబిరాల్లో ఉదయం నుంచి రైతులు నిరసనలకు దిగుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.