తెలంగాణ రాజకీయాల్లో మారిపోతున్న స్క్రిప్ట్‌లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాల్లో స్క్రిప్ట్‌లు మారిపోతున్నాయ్. ఏ పార్టీలో అయితే తమకు అనుకూలంగా ఉంటుందో.. ఏ పార్టీ అయితే టికెట్ హామీ ఉంటుందో అక్కడికి చేరిపోతున్నారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌లు చేసేశారు. మరీ ముఖ్యంగా కన్నడనాట ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్‌ గెలుపొందడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సీన్ మారిపోయింది. కర్ణాటకలో గెలవడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వచ్చింది. దీంతో కార్యకర్తలు, నేతలు యమా జోష్‌లో ఉన్నారు. కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ఎన్నికలు జరగబోతున్నాయ్. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే కేసీఆర్‌ను గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అందుకే 2014, 2018 ఎన్నికల సమయంలో పార్టీ మారిన కాంగ్రెస్ నేతలందర్నీ తిరిగి సొంత గూటికి తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి శుక్రవారం నాడు గాంధీ భవన్ వేదికగా శశిధర్ రెడ్డి.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఈయనతో పాటు సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కీలక నేత డాక్టర్ మట్టా దయానంద్, డాక్టర్ మట్టా రాగమయి కాంగ్రెస్‌లో చేరారు.కొందరు కీలక నేతలు బీఆర్ఎస్, నుంచి బయటికొచ్చేసి తిరిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.