మహానంది ఆలయ పరిసరాల్లో చిరుత సంచారం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:  నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం పరిసరాల్లో చిరుత హల్ చల్ చేసింది. ఆలయ ఈవో పక్కన ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అడవిలో నుంచి క్షేత్ర పరిసరాల్లోకి చిరుత ప్రవేశించి విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకుంది. కుక్కలు భయంతో గట్టిగా మొరగడంతో విద్యుత్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. స్థానికులు , విద్యుత్ సిబ్బంది కేకలు, విజిల్స్ వేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆలయ అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రేపు చిరుత పాద ముద్రలను అటవీ అధికారులు పరిశీలించనున్నారు. చిరుత సంచారంతో భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కారణమేదైనా పుణ్యక్షేత్రాలో క్రూరమృగాల సంచారం ఇటు భక్తులను, అటు స్ధానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.