చికోటి ప్రవీణ్ తో పాటు మరి కొంత మంది అరెస్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వివాదాలతో సహవాసం చేస్తూ.. సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేసే చికోటి ప్రవీణ్ ను ఆయన తో పాటు మరి కొంత మందిని థాయ్ లాండ్ పోలీసులు అరెస్టు చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.థాయ్ లాండ్ లోని పటాయాలోని ఒక విలాసవంతమైన హోటల్ లో నిర్వహిస్తున్న గ్యాంబ్లింగ్ దందాను అక్కడి పోలీసులు భారీ స్కెచ్ తో పట్టుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం 93 మందిని అదుపులోకి తీసుకోగా.. వారిలో 83 మంది భారతీయులుగా చెబుతున్నారు. వారిలో హైదరాబాద్ మహానగరానికి చెందిన గ్యాంబ్లర్ చికోటి ప్రవీణ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.భారతీయులతో పాటు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు. పోలీసులకు పట్టుబడిన 93 మందిలో 14 మంది మహిళలు కావటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక మహిళ ఉన్నట్లుగా తెలుస్తోంది. నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గేమింగ్ చిప్స్ విలువ ఏకంగా రూ.20 కోట్లు ఉండటం చూస్తే.. ఇదెంత భారీ రాకెట్ అన్న విషయం అర్థమవుతుంది. పెద్ద ఎత్తున భారత కరెన్సీని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.గ్యాంబ్లింగ్ ఆడేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖుల్ని థాయ్ లాండ్ లోని పటాయాకు తరలించిన వ్యవహారంపై స్థానిక పోలీసులకు సమాచారం అందటంతో వారు దాడులు చేసినట్లు చెబుతున్నారు. థాయ్ మహిళలతో కలిసి క్యాసినో ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా థాయ్ పోలీసులకు పట్టుబడిన వారిలో పెద్ద తలకాయలు ఉండటం సంచలనంగా మారింది.రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన సంపన్నులు పలువురు మూడు రోజుల క్రితం పటాయాకు తీసుకెళ్లి.. గ్యాంబ్లింగ్ ఆటతో మస్తు బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. చికోటి అరెస్ట్ ను ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ కన్ఫర్మ్ చేయటం లేదు.ఇదిలా ఉంటే.. థాయ్ లాండ్ లో చట్టాలు కఠినంగా ఉంటాయని.. గ్యాంబ్లింగ్ కేసులో దొరికితే శిక్షలు కఠినంగా ఉంటాయన్న సమాచారంతో తాజాగా పోలీసులకు పట్టుబడిన వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 27 నుంచి ఒక కాన్ఫరెన్సు హాల్ ను బుక్ చేసి మరీ.. ఈ భారీ గ్యాబ్లింగ్ క్రీడను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కీలకంగా వ్యవహరించిన మహిళ ఎవరుఆమె ఎక్కడి వారుఆమెకు.. చికోటి ప్రవీణ్ కు ఉన్న లింకులు ఏమిటిఅన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. చికోటి ఏం చెబితే ఇంత పెద్ద తలకాయలు థాయ్ లాండ్ కు వెళ్లాయిఅన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.