కేంద్ర ప్ర‌భుత్వ కార్యాయాల్లో ఐఫోన్లు వాడ‌కంపై నిషేధం విదించిన  చైనా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర ప్ర‌భుత్వ కార్యాయాల్లో యాపిల్ ఐఫోన్లుఇత‌ర విదేశీ బ్రాండ్ డివైజ్‌ల వాడ‌కంపై చైనా నిషేధం విధించింది. ఈ డివైజ్‌ల‌ను కార్యాల‌యాల్లో వాడ‌కూడ‌ద‌నివాటిని కార్యాల‌యాల‌కు తీసుకురావ‌ద్ద‌ని ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం ఆదేశించింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఐఫోన్ల‌ వాడ‌కాన్ని నిషేధిస్తూ ఉద్యోగుల‌కు పంపిన ఉత్త‌ర్వుల్లో ఉన్న‌తాధికారులు స్ప‌ష్టం చేశారు.ఐఫోన్ 15 లాంఛ్ ఈవెంట్ మ‌రికొద్ది వారాల్లో జ‌ర‌గ‌నుండ‌గా చైనా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఐఫోన్ల వాడ‌కంపై నిషేధం విధించ‌డం గ‌మ‌నార్హం. చైనా-అమెరికా మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్న క్ర‌మంలో చైనాలో ప‌నిచేస్తున్న విదేశీ కంపెనీల్లోనూ ఈ ప‌రిణామం గుబులు రేపుతోంది. యాపిల్‌తో పాటు నిషేధించిన‌ ఇత‌ర బ్రాండ్ల వివ‌రాలు ఏంట‌నేది వెల్ల‌డికాలేద‌ని వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ పేర్కొంది.చైనాలో ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఐఫోన్ల నిషేధంపై యాపిల్‌తో పాటు చైనా స్టేట్ కౌన్సిల్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస్ ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేదు. డేటా భద్ర‌త‌పై ఇటీవ‌ల ప‌లు చర్య‌లు చేప‌డుతున్న చైనా కంపెనీల‌కు నూత‌న నిబంధ‌న‌లుప్ర‌మాణాల‌ను నిర్ధేశిస్తోంది. అమెరిక‌న్ టెక్ దిగ్గ‌జాల‌కు చెక్ పెట్టేందుకు దేశీయ కంపెనీల‌ను టెక్నాల‌జీలో స్వ‌యం స‌మృద్ధి సాధించేలా ప్రోత్స‌హిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.