క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్ల గురించి చైనా త‌న డేటాను షేర్ చేయ‌డం లేదు

-  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆగ్ర‌హం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: క‌రోనా వైర‌స్ఆన‌వాళ్ల గురించి చైనా త‌న వ‌ద్ద ఉన్న డేటాను షేర్ చేయ‌డం లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. క‌రోనా ఆన‌వాళ్ల‌కు చెందిన అంశంపై శుక్ర‌వారం డ‌బ్ల్యూహెచ్‌వో కొన్ని కీల‌క ఆధారాల‌ను వెల్ల‌డించింది. క‌రోనా డేటాను మూడేళ్ల క్రితం ఎందుకు రిలీజ్ చేయలేద‌ని చైనా అధికారుల్ని డ‌బ్ల్యూహెచ్‌వో అడిగింది. జ‌న‌వ‌రిలో ఆన్‌లైన్‌లో ప‌బ్లిష్ అయిన ఆ డేటా ఇప్పుడు ఎందుకు క‌నిపించ‌డం లేద‌ని కూడా ప్ర‌శ్నించింది.అయితే అంత‌ర్జాతీయ నిపుణులబృందాలు ఆ డేటాను డౌన్‌లోడ్ చేసి అధ్య‌య‌నం చేస్తున్నాయి. క‌రోనా వైర‌స్ అక్ర‌మంగా ట్రేడింగ్ చేసిన‌ ర‌కూన్ కుక్క‌లనుంచి మ‌నుషుల‌కు సోకినట్లు ఆ డేటా ద్వారా శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నాకు వ‌స్తున్నారు. వుహాన్‌లో ఉన్న హువ‌న‌న్ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్‌లో ఆ ఇన్‌ఫెక్ష‌న్ జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. కానీ చైనా అధికారులు జీన్ సీక్వెన్సింగ్డేటాను తొల‌గించ‌డం వ‌ల్ల‌.. తుది ఫ‌లితాల‌ను పోల్చ‌లేక‌పోతున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మూడేళ్ల క్రిత‌మే ఆ డేటాను షేర్ చేస్తే బాగుండేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్ట‌ర్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు.చైనా త‌న డేటా నుంచి తొల‌గించిన ఆధారాల‌ను త‌క్ష‌ణ‌మే అంత‌ర్జాతీయ స‌మాజంతో షేర్ చేసుకోవాల‌ని టెడ్రోస్ తెలిపారు. న‌క్కలాంటి జంతువులైన ర‌కూన్ కుక్కల నుంచి క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంది ఉంటుంద‌ని డేటా ఆధారంగా నిపుణుల బృందం ఒక అంచ‌నాకు వ‌చ్చింది. వుహాన్ మార్కెట్‌లో సేక‌రించిన డీఎన్ఏ శ్యాంపిళ్లు క‌రోనా వైర‌స్ జెన‌టిక్ నిర్మాణం ఒకే ర‌కంగా ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గురించారు. తొలుత ర‌కూన్ కుక్క‌ల‌కు వ్యాపించిన వైర‌స్‌.. ఆ త‌ర్వాత ఆ జంతువుల ద్వారా మ‌నుషుల‌కు వైర‌స్ వ్యాప్తి చెంది ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.వుహాన్ మార్కెట్‌లో ఉన్న జంతువుల లాలాజ‌లంశ్యాంపిళ్ల‌ను సేక‌రించిన శాస్త్ర‌వేత్త‌లు తీవ్ర స్థాయిలో అధ్య‌య‌నం చేప‌ట్టారు. జ‌న్యుప‌ర‌మైన కోణంలో వైర‌స్ నిపుణులు స్ట‌డీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.