చైనా వక్రబుద్ధి..అరుణాచల్‌ప్రదేశ్‌,ఆక్సాయ్‌ చిన్‌ తమవేనంటూ మ్యాప్‌ విడుదల

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్‌లో భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్ ఆక్సాయ్‌ చిన్‌ తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్‌ మ్యాప్‌ను రూపొందించింది. చైనా న్యాచురల్‌ రిసోర్సేస్‌ రూపొందించిన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంది. ఇక 1962 వరకు కశ్మీర్‌లో భాగంగా ఉన్న అక్సాయ్‌ చిన్‌ను డ్రాగన్‌ దేశం ఆక్రమించుకున్నది. అప్పటి నుంచి ఈ భూభాగంపై భారత్‌, చైనాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.ఇక తైవాన్ ‌, దక్షిణ చైనా సముద్రాలను కూడా చైనాలో భాగమేనని నూతన మ్యాచ్‌లో పేర్కొంది. దక్షిణ చైనా సముంద్రంలో అతిపెద్ద భాగంగా ఉన్న నైన్‌ డ్యాష్‌ లైన్‌ను కూడా తమ ప్రాంతంగా చూపించుకున్నది. అయితే దీనిపై వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, బ్రూనై దేశాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.కాగా, బ్రిక్స్ స‌ద‌స్సులో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం స‌హా ద్వైపాక్షిక అంశాల‌పై సంప్రదింపులు జ‌రిగాయ‌ని బీజింగ్ అధికారిక ప్రక‌ట‌న‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. భార‌త్‌-చైనా సంబంధాల మెరుగుప‌డితే ఇరు దేశాల‌తో పాటు ప్రజ‌ల ఉమ్మడి ప్రయోజ‌నాలు నెర‌వేర‌తాయ‌ని జిన్‌పింగ్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.