తైవాన్‌పై చైనా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న..

-     24 గంట‌ల్లో సుమారు 71 యుద్ధ విమానాల‌తో విన్యాసాలు -    ఏడు భారీ నౌక‌ల‌ను కూడా తైవాన్ దిశ‌గా చైనా మ‌ళ్లింపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తైవాన్‌పై చైనా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో సుమారు 71 యుద్ధ విమానాల‌తో చైనా సైనిక స‌త్తా చాటింది. ఏడు భారీ నౌక‌ల‌ను కూడా తైవాన్ దిశ‌గా చైనా మ‌ళ్లించిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని తైవాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ పేర్కొన్న‌ది. అమెరికా ర‌క్ష‌ణ బిల్లులో తైవాన్‌కు కొన్ని కేటాయింపులు చేసిన నేప‌థ్యంలో ఆ దేశంపై చైనా ఆగ్ర‌హంగా ఉంది. తైవాన్‌పై చైనా సైనిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.తైవాన్ త‌మ భూభాగ‌మే అని చైనా వాదిస్తున్న విష‌యం తెలిసిందే. తైవాన్ జ‌ల సంధి వ‌ర‌కు సుమారు 47 చైనా ర‌క్ష‌ణ‌శాఖ విమానాలు వ‌చ్చిన‌ట్లు తైవాన్ ర‌క్ష‌ణ‌శాఖ తెలిపింది. జే-16 ఫైట‌ర్ జెట్స్ 18, జే-1 ఫైట‌ర్ విమానాలు 11, ఆరు సుఖోయ్‌-30 ఫైట‌ర్ విమానాల‌తో పాటు డ్రోన్ల‌ను కూడా తైవాన్‌పైకి చైనా పంపిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.