లాయర్లకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌..

- లా నేస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన మంచి పని ద్వారా లాయర్ల మనస్సులో ఒక స్థానం అన్నది ఏర్పడితే.. వాళ్లు పేదవాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతారని సీఎం అన్నారు. డబ్బులు లేని పేదవాడికి మనం కూడా సహాయం చేయగల్గాలని, ప్రభుత్వం కూడా మనకు తోడుగా నిలబడింది కదా అని వాళ్లందరీ మనసులో ఎక్కడో ఒక బలమైన సీడ్ పడాలని సీఎం అన్నారు. మొదటి మూడేళ్లు న్యాయ వృత్తిలోకి వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి తోడుగా ఉండేందుకు ప్రభుత్వం లా నేస్తం అనే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.ఈ పథకం ద్వారా లాయర్ల వృత్తిలో వారు స్థిరపడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. మూడున్నర సంవత్సరాల్లో ఈ పథకం ద్వారా 4248 మంది జూనియర్ లాయర్లు స్థిరపడేందుకు వీరికోసం రూ. 35 కోట్ల 40 లక్షలు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ద్వారా 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు లా నేస్తం పథకంలో ఇంకా కొనసాగుతున్నారని చెప్పారు. ఈ రోజు వారికి దాదాపు రూ. కోటికిపైగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని జగన్ తెలిపారు. ఈ పథకాన్ని సంవత్సరంలో 6 నెలలకొసారి ఇచ్చేటట్టుగా ఇస్తామని సీఎం చెప్పారు. రూ. 100 కోట్లతో లాయర్లకు సంబంధించి కార్పోస్ ఫండ్ క్రియేట్ చేయడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో కూడా కార్పోస్ ఫండ్ అందుబాటులో ఉంచామని, దాదాపు రూ. 25 కోట్ల వరకు లాయర్లందరికీ మంచి చేయడం జరిగిందని సీఎం అన్నారు. వైఎస్సార్ లా నేస్తం (YSRLawNestham.Ap.Govt.in) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.