సీఎం కేసీఆర్ యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేశారు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పంట రుణమాఫీ పేరుతో యావత్ తెలంగాణ రైతాంగాన్ని దగా చేశాడని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ అన్నారు . రూ. లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలోనూ, శాసనసభలోనూ ప్రకటించి ఏండ్లు. గడుస్తున్నా.. ఇప్పటికీ అమలుకు నోచక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి 2018 ఏప్రిల్ 1న లక్ష లోపు రుణమాఫీకి కటాఫ్ విధించారు. విధివిధానాల ఖరారు చేసేందుకు 15 నెలల సమయం తీసుకుని.. 2020 మార్చిన 17న జీవో విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తంగా 47.40 లక్షలమంది రైతులకు సంబంధించిన రూ.24,738 కోట్ల రుణాలు మాఫీచేయాల్సి ఉండగా.. ఇప్పటికీ సగం మందికి కూడా రుణమాఫీ పూర్తిగా జరగలేదన్నారు. పేరుకు మాత్రం బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లుగా పద్దుల్లో చూపిస్తూ.. వాస్తవంగా మాత్రం అందుకు విరుద్ధంగా చేస్తూ రైతాంగాన్ని నట్టేట ముంచిన మోసకారి ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. నాలుగేళ్లలో జరిగిన మాఫీ కేవలం రూ763 కోట్లు మాత్రమే. దీంతో ట్యాంకర్లు రైతులను డిఫాల్టర్లుగా చూపిస్తూ.. కొత్త రుణాలు ఇవ్వడం రుణమాఫీ పేరుతో రైతాంగాన్ని నట్టేట ముంచిన ఘనత కేసీఆర్ దే. రైతులు డిఫాల్టర్లుగా మారుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే రుణమాఫీ నిధులను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచార కమిటీ చైర్మన్ గా డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.