గిరిజనుడి పాదాలను కడిగి క్షమాపణలు చెప్పిన సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా అవమానించిన గిరిజనుడికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  క్షమాపణ చెప్పారు. బాధితుని పాదాలను కడిగిశాలువతో సత్కరించారు. నిందితుడిని బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేయడంతోపాటుఅతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసిన సంగతి తెలిసిందే.దశమత్ రావత్ అనే గిరిజన కూలీపై ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో ఇటీవల బయటపడింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి శివరాజ్ వెంటనే స్పందించినిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడిని తాను భోపాల్‌లో కలుస్తాననిక్షమాపణ చెబుతానని ప్రకటించారు. నిందితుడిని పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 294 (అసభ్యకర చర్యలకు పాల్పడటం), 504 (శాంతికి భంగం కలిగేవిధంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం)ఎస్సీఎస్టీ చట్టంజాతీయ భద్రత చట్టం ప్రకారం నిందితునిపై ఆరోపణలను నమోదు చేశారు. బుధవారం సాయంత్రం నిందితుని అక్రమ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. ఆ సమయంలో ఆయన తల్లి స్పృహ కోల్పోయారు. మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూనిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.సీఎం చౌహాన్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో సిద్ధి జిల్లాలో ఓ వ్యక్తి మరొక వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందనిఆ విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసిజాతీయ భద్రత చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసికఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. బాధితుడినిఆయన కుటుంబ సభ్యులను తాను భోపాల్‌లో కలుస్తానని చెప్పారు.బాధితుడు దశమత్ రావత్‌ను శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం కలిశారు. రావత్‌ను కుర్చీలో కూర్చోబెట్టిఆయన పాదాలను శివరాజ్ కడిగారు. ఆయనకు శాలువ కప్పి సత్కరించిక్షమాపణ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. తన మనసు ఎంతో బాధతో నిండిపోయిందనిప్రజలే తనకు దేవుళ్లని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.