యాదాద్రి నర్సన్నను దర్శించుకున్న సీఎంలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్ , యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు.

సీఎం కేసీఆర్‌తోపాటే యాదాద్రికి వచ్చినా కేరళ సీఎం స్వామివారి దర్శనానికి వెళ్లలేదు. ఆయనతోపాటు సీపీఐ జాతీయ నేత రాజా కూడా ప్రెసిడెన్షియల్‌ సూట్‌లోనే ఉండిపోయారు. కాసేపట్లో మిగతావాళ్ల పూజలు పూర్తయ్యాక.. అంతా కలిసి ఖమ్మం వెళ్తారు. నలుగురు సీఎంలతో పాటు కీలక నేతల టూర్‌ నేపథ్యంలో యాదగిరి గుట్టలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి స్వామివారి దర్శనాలు నిలిపివేశారు. యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణం విశిష్టతల్ని అతిథులకు వివరించారు సీఎం కేసీఆర్‌. ప్రత్యేక పూజల అనంతరం ఖమ్మం చేరుకుని కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం కేసీఆర్.

Leave A Reply

Your email address will not be published.