కాలేజీ హాస్టల్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: .సి కాలేజీ హాస్టల్ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని ఈరోజు బి.సి కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కాలేజీ హాస్టల్ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్ర BC,SC,ST కాలేజీ హాస్టల్ వర్కర్ల సంఘ అధ్యక్షులు ఎమ్.శేఖర్ అధ్యక్షతన జరిగింది.ఈ ధర్నాకు ముఖ్యాతిధిగా రాజ్యసభ సభ్యులుజాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పాల్గొని ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న BC,SC,ST కాలేజీ హాస్టల్ వర్కర్లను పర్మినెంట్ లు చేయాలని కింది సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.అనంతరం సంఘ అధ్యక్షులు ఎమ్.శేఖర్ మాత్య్లడుతూ హాస్టళ్ళలో పనిచేసే కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి. గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. కానీ పర్మినెంటు చేయడం లేదు. కావున తమరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పర్మినెంట్ చేయాలనీ,కాలేజి హాస్టల్ వర్కర్లను అవుట్ సోర్సింగ్ నుండి తీసివేసి కాంట్రాక్టు పద్దతిన కొనసాగించాలి. మాకు గత ఫిబ్రవరి (2023) నుండి ఇప్పటివరకు జీతాలు రాలేదు.ప్రతి నెల నెల 1 వ తేది న ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మాకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.వర్కర్ల జీతాల నెలకు 15,000 నుంచి 25 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. గ్రామాలలో లేబర్ కు రోజుకు 600 చొప్పున నెలకు 18000 సంపాదిస్తున్నారు. హైదరాబాద్ లో అడ్డ కూలీలు నెలకు 21 వేల నుంచి 24 వేలు వరకు సంపాదిస్తున్నారు. అంతకంటే తక్కువ ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం న్యాయమాపెరిగిన ధరల ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకొని వెంటనే జీతాలు 25 వేలకు  పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో హాస్టల్ వర్కర్ల సంఘం నాయకులు  త్రివేని, రాధా,వీరభద్రయ్యయాదగిరి,శ్రీలక్ష్మి,కవిత, సంపూర్ణ, సాయులు, విజయ్,సరస్వతి,రమణ,బాలాజీ   తదితరులు పాల్గొన్నారు. 

Leave A Reply

Your email address will not be published.