కళాశాలని దేవాలయంలా భావించాలి-లిల్లీ మేరి

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్; కళాశాల పరిసరాలను దేవాలయముల తీర్చిదిద్దుకుంటే రోగులకు సేవ చేసిన భాగ్యం కలుగుతుందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరి అన్నారు.  గాంధీ జయంతిని పురస్కరించుకుని ‘ స్వచ్ఛతా హి సేవలో’ భాగముగా కళాశాలలో శ్రమదానం చేశారు.  గాంధీ జయంతి సందర్భంగా అది మహాత్మానికి స్వచ్ఛంజలి అవుతుందని, ఈరోజు స్వచ్ఛతపై దేశం మొత్తం దృష్టి పెట్టిందని లిల్లీ మీరి అన్నారు.  నేడు భారత ప్రభుత్వ పిలుపుమేరకు పలువురికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు, పలు రంగాల ప్రముఖుల నుంచి విద్యార్థుల వరకు అన్ని రంగాల ప్రజలు చేపురులు పెట్టి స్వచ్ఛతాహి సేవలో పాల్గొన్నారు అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లిల్లీ మేరి  అన్నారు. ముందుగా అధ్యాపకులు కళాశాల పరిసరాలను శుభ్రం చేసి సిబ్బందితో కలిసి గడ్డి మొక్కలను తీసివేశారు. ప్రతి ఒక్కరూ తమ కళాశాలను తన సొంత ప్రాంతాలుగా భావించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమమునకు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.