తెలంగాణ కాషాయ దళపతి కి కమ్యూనిస్టు కార్యకర్త లాల్ సలాం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్ట వెళుతుండగా మార్గమధ్యలో చిల్లపురం వద్ద కమ్యూనిస్టు కార్యకర్త మేకల కాశయ్య బండి సంజయ్ తో కలిశారు. అన్నా…. నాపేరు మేకల కాశయ్య. కమ్యూనిస్టు కార్యకర్తను. మీ నాయకత్వంలో మాలాంటి పేదల కోసం బీజేపీ చేస్తున్న పోరాటాలు భేష్.మా కమ్యూనిస్టులు కేసీఆర్ కు అమ్ముడుపోయారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనలో పేదలు, దళితులంతా అల్లడిపోతున్నారు. అందుకే మునుగోడు ఎన్నికల్లో మేమంతా బీజేపీకే ఓటేస్తం అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ తో కలిసి ఫోటో దిగారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఆదుకుంటారని ఇంటింటా ప్రచారం చేసి గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మేకల కాశయ్య కు కాషాయ కండువా కప్పిన బండి సంజయ్ మీలా అందరు ఆలోచించాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.