చిరుదాన్యాల తో సంపూర్ణ ఆరోగ్యం

.. మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 పురస్కరించుకొని మినిట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబోయే పాత పంటలు..కార్తీక వనభోజనాలు జాతర బ్రోచర్ ను  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జి. నిరంజన్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు దేశంలో మినరల్స్ లోపం వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారన్నారు. వాటిని అధిగమించడానికి మన పూర్వం నుండి వచ్చిన చిరుధాన్యాల పంటలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఆధునిక ప్రపంచంలో నేడు వాటిని వాడకం తగ్గిందని తద్వారా ప్రజలు రోగాలు కొని తెచ్చుకుంటున్నారని ఆయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక వైద్యులు చిరుధాన్యాల వల్ల రోగాలు నయం చేసుకునే విధానాలను రూపొందించి నేడు ప్రజలకు వాటి గురించి వాటి విలువ గురించి తెలియజేస్తూ వాటి వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. దీనిని ప్రతి ఒక్క పౌరుడు గుర్తించవలసిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు డైరక్టర్  తో పాటు మిల్లెట్స్ అసోసియేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ పురం వెంకటేశం గుప్తా మినిట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.