నవంబర్ 15 నుంచి ఏపీలో సమగ్ర కులగణన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారతదేశంలో బీహార్ తర్వాత దేశంలో సమగ్ర కులగన చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఎక్కబోతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్ అన్నారు. మంగళవారం  అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ సమాచార శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస  వేణుగోపాలకృష్ణ ను బీసీ నాయకులు కుప్పెల సూర్యనారాయణ, దార్ల శ్రీనివాసరావు తో కలిసి ఢిల్లీ ఓబీసీ ఇంచార్జ్ కర్రీ వేణుమాధవ్ మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ను  ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కర్రీ వేణుమాధవ్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక చైతన్య బస్సు యాత్ర పేరుతో పార్టీలోని అన్ని క్యాడర్లను క్షేత్రస్థాయిలోకి పంపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయం రాజ్యాధికార దిశగా ఈ వర్గాలను ముందుకు తీసుకెళ్తూ సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి బడుగు బలహీన వర్గాలు అండగా నిలుస్తారని ఈ సామాజిక చైతన్య బస్సు యాత్ర సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తన స్వగ్రామం వద్ద ఈరోజు పారిశుద్ధ కార్మికులతో సహం పక్తీ భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వేణుమాధవ్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.