జోషిమఠ్‌లో భూమి కుంగిపోవ‌డం పట్ల ఆందోళ‌న

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తరాఖండ్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన జోషిమఠ్‌లో భూమి కుంగిపోవ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో భూమి కోత‌కు గురికావ‌డం, ప‌గుళ్లతో భ‌యాన‌క ప‌రిస్ధితి నెల‌కొంది. 600కు పైగా ఇండ్ల‌కు ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి. ఇక జోషిమ‌ఠ్ ప‌ట్ట‌ణ‌మే కాకుండా ఉత్త‌ర‌కాశీ, నైనిటాల్‌కూ ప్ర‌మాదం పొంచిఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. హిమాల‌యాల చెంత‌నున్న ప‌లు ప‌ట్ణణాలు, న‌గ‌రాల్లో భూమి కుంగుబాటుకు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.స్ధానిక భౌగోళిక ప‌రిస్ధితుల‌ను విస్మ‌రిస్తూ కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్టిన ఫలితంగానే ప‌ర్యావ‌ర‌ణ అన‌నుకూల ప‌రిస్ధితుల‌కు దారితీస్తోంద‌ని వారు స్ప‌ష్టం చేశారు. బ‌ల‌హీన పునాదుల‌తో పాటు, ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల భూమి కోత‌కు గుర‌వ‌డం కూడా జోషిమ‌ఠ్‌లో ఈ ప‌రిస్ధితి నెల‌కొంద‌ని వారు వివ‌రించారు. మాన‌వ ప్రేరిత కార్య‌క‌లాపాలు దీనికి మ‌రింత ఆజ్యం పోశాయ‌ని చెబుతున్నారు.ఎంసీటీ-2 జోన్ రీయాక్టివేట్ కావ‌డంతో ఒక్క‌సారిగా జోషిమ‌ఠ్‌లో భూమి కుంగిపోయింద‌ని, ఈ రీయాక్టివేష‌న్ ఎప్పుడు జ‌రుగుతుంద‌ని ఏ భూగ‌ర్భ శాస్త్ర‌వేత్త అంచ‌నా వేయ‌లేర‌ని కుమౌన్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ బ‌హ‌దూర్ సింగ్ కోట్లియా చెప్పారు. జోషిమ‌ఠ్ ఒక్క‌టే ఇలాంటి ప‌రిస్ధితికి గురికాబోద‌ని, ఉత్త‌ర కాశీ, నైనిటాల్‌కూ ఈ ముప్పు ఉంద‌ని హెచ్చ‌రించారు. తాము రెండు ద‌శాబ్ధాల నుంచి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నా ఇప్ప‌టివ‌ర‌కూ నిర్ల‌క్ష్యం చేశార‌ని మండిప‌డ్డారు. ప్ర‌కృతితో మీరు పోరాడి గెల‌వ‌లేర‌ని డాక్ట‌ర్ సింగ్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.