సంక్షోభంలో కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం   

- తారాస్థాయికి చేరుకొన్న అంతర్గత విభేదాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గత మేలో పార్టీ అధికారంలోకి వచ్చీరాగానే నేతల మధ్య మొదలైన కుమ్ములాటలుఅంతర్గత విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులుఎమ్మెల్యేలునేతలుకార్యకర్తలు ఇలా ప్రతీ ఒక్కరూ సీఎం సిద్ధరామయ్యడిప్యూటీ సీఎంకేపీపీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అనే రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరిపై ఒకరు.. ఎత్తులకు పైఎత్తులు వేసుకొంటున్నారు. వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నారు. వెరసి ఆరు నెలల కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం దినదిన గండం నూరేండ్ల ఆయుష్షు మాదిరిగా తయారైంది. బీజేపీ 40 శాతం కమీషన్‌ రాజ్‌’ సర్కారును దించి కర్ణాటక పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌కు తొలిరోజు నుంచే అంతర్గత కుమ్ములాటల బెడద మొదలైంది. సీఎంగా ఎవరిని నియమించాలన్న విషయంలో అధిష్ఠానం తాత్సారం చేయడంసిద్ధరామయ్యడీకే వర్గాలు తమ నాయకుడినే సీఎంగా ప్రకటిస్తారని గట్టి నమ్మకంతో ఉండటంతో వివాదాలు తీవ్రమయ్యాయి. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వెనుకబడినవర్గానికి (ఓబీసీ) చెందిన సిద్ధరామయ్యను పార్టీ సీఎంగా ప్రకటించడంతో డీకే వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోలోన అసమ్మతితో రగులుతున్న డీకే కూడా సిద్ధరామయ్యకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నించారన్న విమర్శలు ఉన్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీప్రభుత్వం కూడా రెండు వర్గాలుగా చీలినట్టు తెలుస్తున్నది. గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. సీఎం మార్పుక్యాబినెట్‌ మార్పులపై నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. మాండ్య ఎమ్మెల్యే రవికుమార్‌ గౌడ ఇటీవల మాట్లాడుతూ ప్రభుత్వ రెండున్నరేండ్ల టర్మ్‌ తర్వాత డీకే శివకుమార్‌ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కొంత మంది మంత్రులు సిద్ధరామయ్యేనే పూర్తి కాలం సీఎంగా ఉంటారని పేర్కొనగాదానిపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకోవాలని మరికొంత మంది వ్యాఖ్యానించారు. మరోవైపు క్యాబినెట్‌ పునర్వ్యవస్థీరణపై సీనియర్‌ నేతఅసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ అశోక్‌ పట్టాన్‌ మాట్లాడుతూ రెండున్నరేండ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని సూర్జేవాలాకేసీ వేణుగోపాల్‌ తనతో చెప్పారని పేర్కొన్నారు. ఇదే సమయంలో పలు కార్పొరేషన్లుబోర్డులకు చైర్మన్ల నియామకాల్లో తమ వర్గానికి అన్యాయం జరుగుతున్నదని ఇటు సిద్ధు వర్గం నేతలుఅటు డీకే వర్గం నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలుప్రత్యారోపణలు చేసుకొన్నారు. ఇలా కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటలు ముదిరిపాకాన పడ్డాయి.

Leave A Reply

Your email address will not be published.